29 May, 2026 | 2:54 AM

గ్లోబల్ సిటీగా హైదరాబాద్

29-05-2026 12:49 AM
  1. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రూపకల్పన
  2. ఫ్యూచర్ సిటీ దేశానికే తలమానికం
  3. మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
  4. ఎఫ్‌సీడీఏ భవన నిర్మాణ పనులపై సమీక్ష

హైదరాబాద్, మే 28 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్ సిటీతో భవిష్యత్‌లో హైదరా బాద్‌ను గోబల్ సిటీగా రూపుదిద్దుకుంటుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బా బు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం, కార్యాచరణ గ్లోబల్ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా పని చేస్తున్నామని తెలిపారు. ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ(ఎఫ్‌సీడీఏ) కార్యాలయ భవన నిర్మాణ పనులు శుక్రవారం మంత్రులు సందర్శించారు.

పనుల పురోగతిపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారి టీ భవనం పనులు వేగంగా జరుగుతున్నాయ ని, జూన్ 2 లేదా 3 తేదీల్లో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం ఉంటుంద ని, త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు.

తమ ప్రభుత్వ హయాంలోనే ఫ్యూచర్ సిటీని అందుబాటులోకి తెచ్చి, ప్రజలకు ఇచ్చి న హామీని నిలబెట్టుకుంటామని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపే నగరంగా ఫ్యూచర్ సిటీ ఎదగాలన్నదే ప్రభుత్వ సంకల్పమన్నారు. ఇప్పటికే పోలీస్ కమిషనరేట్ ఏర్పాటుతో పాటు గ్లోబల్ ప్రెజెన్స్ కలిగిన ప్రభుత్వ కార్యాలయాలను  ఇక్కడి నుంచే నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. యువత నైపుణ్యాభివృద్ధి కోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. 

ఫ్యూచర్ సిటీతో లక్షలాది మందికి ఉపాధి : పొంగులేటి 

సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రభు త్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఫ్యూచర్ సిటీ నిర్మిస్తుంది మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీ దేశానికే తలమానికంగా నిలిచే ప్రాజెకాక్టుగ్గా రూపుది ద్దుకుటుం దన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. యూనివర్సిటీకి శాశ్వత క్యాంపస్ నిర్మాణం వేగంగా జరుగుతుందని చెప్పారు. అనంతరం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణ పనులను మంత్రులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్ కె.శశాంక, మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు  పాల్గొన్నారు.