29 May, 2026 | 1:36 AM

ఉద్యమకారులను గౌరవించాల్సిన బాధ్యత మనందరిదీ

29-05-2026 12:51 AM

ఉద్యమ జేఏసీ నాయకుడు జాడి రాజు 

మిర్యాలగూడ మే 28: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కీలక పా త్ర పోషించిన ఉద్యమకారులందరినీ గౌరవించి సన్మానించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలంగాణ తొలి దశ, మలిదశ ఉద్యమకారుడు, జేఏసీ నాయకులు, ప్రముఖ వైద్యులు డాక్టర్ జాడి రాజు అన్నారు. గురువారం స్థానిక బీసీ భవన్ లో జరిగిన ఉద్యమకారుల సమావేశానికి జేఏసీ నా యకులు, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నేత మాలోత్ దశరథ్ నాయక్ అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా డాక్టర్ రాజు మాట్లాడుతూ సబ్బండ వర్గాల సామూహిక ఉద్యమాలతోనే తెలంగాణ సాధించబడిందన్నారు. అన్ని వర్గాల ప్రజలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని ఆంధ్ర పాలక పక్షాన్ని దిక్కరించారని పేర్కొన్నారు. ఉద్య మం మరింత ఉధృతం కావడంతో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు తెలం గాణను ప్రకటించిందన్నారు.

తెలంగాణ ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించిన నాయకులను గుర్తించి గౌరవించి సన్మానించుకుంటే ఉద్యమకారులు ఆనందపడతార న్నారు. ఇప్పటివరకు ఉద్యమకారు లను సన్మానించిన వారు ఎవరూ లేరని తెలంగా ణ ఉద్యమకారు ఫోరం ఆధ్వర్యంలో జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు సన్మానించాలని నిర్ణయించడం అభినందనీయమని అన్నారు. నిజమైన నికర్శైన ఉద్య మకారులను గుర్తించాలని ఆయన సూచించారు. 

కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి, ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మాడుగుల శ్రీనివాస్, గిరిజన సమాఖ్య జిల్లా కా ర్యదర్శి దిరావత్ లింగ నాయక్, టీజేఎస్ జి ల్లా ఉపాధ్యక్షులు క్రాంతి కుమార్, నాయక్, బీసీ సంఘం పట్టణ అధ్యక్షులు బంటు వెంకటేశ్వర్లు, యాదవ సంఘం డివిజన్ ప్రధాన కార్యదర్శి చేగోండి మురళి యాదవ్, బీసీ జేఏసీ కోకన్వీనర్ దాసరాజు జయరాజు, ఆర్టీసీ జేఏసీ నాయకులు ఇక్బాల్, జేఏసీ నాయకులు కొండారపు నాగేశ్వరరావు, నీలకంఠ నాయక్, కళాకారుడు కిరణ్, 1969 ఉద్యమ నాయకులు చీదర్ల సత్యనారాయణ, కిష్టయ్య, సినీ టీవీ నటుడు ఎంవిఆర్ రెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.