calender_icon.png 7 December, 2025 | 2:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

@ హైదరాబాద్ హౌస్!

07-12-2025 12:14:09 AM

నాటి నైజాం నవాబు దర్పం, వైభవానికి ప్రతీక ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్. కాలక్రమేణా కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోకి వెళ్లిన తర్వాత అదొక చారిత్రక కట్టడంగా నిలిచింది. ఎందరో విదేశీ అతిథులకు విడిదిగా మారింది. ఇప్పటివరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఇక్కడ ఆతిథ్యం స్వీకరించారు. ఒక్క పుతిన్ మాత్రం తాజాగా విడిదితో రెండోసారి ఆతిథ్యం పుచ్చుకుని రికార్డు సృష్టించడం విశేషం.

ఏవీఎం మ్యూజియం

మారుతున్న కాలానికి అనుగుణంగా తన చిత్రాల్లో ఆధునిక సాంకేతికత ను వినియోగించడంలో ఏవీఎం శరవణన్ దిట్ట. రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి దిగ్గజాల సినీ ప్రస్థా నంలో కీలకమైన మైలురాళ్లుగా నిలిచే పలు విజయవంతమైన సినిమాలు ఏవీఎం ప్రొడక్షన్స్ నిర్మించినవే. తమ స్టూడియోలోని ఓ అంతస్తును సినీరంగానికి చెందిన పాత వస్తువులను ప్రదర్శించే మ్యూజియంగా మార్చారు.