calender_icon.png 17 November, 2025 | 2:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దోపిడీ కేసులో నిందితుడి అరెస్ట్

16-11-2025 12:00:00 AM

శేరిలింగంపల్లి, నవంబర్ 15 (విజయక్రాంతి): సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇటీవల చోటుచేసుకున్న దోపిడీలు, చోరీల కేసులపై మియాపూర్ పోలీసులు నిఘా పెంచిన నేపథ్యంలో పాత కేసుల్లో నిందితుడిగా ఉన్న ప్రేమ్‌నగర్ బి బ్లాక్‌కు చెందిన ఆనంద్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం మియాపూర్, చందానగర్, ఆర్సీపురం, అమీన్పూర్, బాచుపల్లి, రాజేంద్రనగర్, పటాన్చెరు, షాద్‌నగర్ పోలీస్ స్టేషన్లలో ఆనంద్‌పై మొత్తం 25 కేసులు నమోదయ్యాయి.

రాత్రివేళ ఒంటరిగా ప్రయాణించే వారిని లక్ష్యంగా చేసుకుని మొబైల్ ఫోన్లు లాక్కోవడం, ద్విచక్రవాహనలపై వెంబడించి వస్తువులు దోచుకోవడం, దుకాణాల వద్ద నిర్లక్ష్యంగా ఉంచిన సామాను ఎత్తుకుపోవడం ఇతడి పద్ధతిగా పోలీసులు తెలిపారు. ఇటీవలి ఘటనల సీసీ కెమెరా ఫుటేజీలను పోల్చి చూస్తూ నిందితుడి కదలికలను గుర్తించిన పోలీసులు ట్రాకింగ్ చేసి ముట్టడి జరిపి అరెస్ట్ చేశారు. విచారణ ముగిసిన అనంతరం నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.