30-07-2025 12:40:11 AM
ప్రత్యేక పూజలు నిర్వహించిన మేయర్
కామారెడ్డి, జూలై 29 (విజయ క్రాంతి), కామారెడ్డి జిల్లా రామారెడ్డి, ఇసన్నపల్లిలో ఉన్న కాలభైరవ స్వామి ఆలయాన్ని హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి కుటుంబ సమేతంగా మంగళవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దక్షిణ భారతదేశంలో ఏకైక దేవాలయం కాలభైరవ స్వామి ఆలయం అని మేయర్ విజయలక్ష్మి కి స్థానికులు తెలిపారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలిపారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మే యర్ విజయలక్ష్మినీ సన్మానించారు.