30-12-2025 04:18:16 PM
హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్ మెట్రో నగరవాసులకు శుభవార్త చెప్పింది. న్యూ ఇయర్ సందర్భంగా బుధవారం రాత్రి నగరవాసులకు సురక్షిత, సులభతరం ప్రయాణాన్ని అందించడానికి మెట్రో పనివేళలను పెంచుతున్నట్టు హెచ్‌ఎంఆర్‌ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్‌విఎస్ రెడ్డి తెలిపారు. డిసెంబర్ 31 రాత్రి నూతన సంవత్సర వేడుకలను దృష్ట్యా ఉంచుకొని హైదరాబాద్ మెట్రో రైళ్లను అర్థరాత్రి ఒంటిగంట వరకు నడవనున్నాయి. ప్రారంభ స్టేషన్ల నుంచి రాత్రి ఒంటి గంటకు చివరి మెట్రో రైలు బయలుదేరనుంది. ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరవేస్తామని ప్రకటించారు.