calender_icon.png 30 December, 2025 | 7:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పతంగులకు చైనా మంజా ధారలు వాడితే చర్యలు తప్పవు

30-12-2025 05:08:08 PM

ఎల్లారెడ్డి,(విజయ క్రాంతి): ఎల్లారెడ్డి సర్కిల్ నిషేధించిన చైనా మాంజా (సింథటిక్, నైలాన్ దారం) విక్రయాలు, వినియోగంపై పోలీసులు నిఘా పెంచారని సీఐ ఎల్లారెడ్డి, దొరగారి రాజారెడ్డి తెలిపారు. రాఖీ, సంక్రాంతి పండగ సందర్భంగా చైనా మాంజా ఎక్కడా విక్రయించకూడదని, గోడౌన్లు, మార్కెట్లపై అధికారులు తనిఖీలు నిర్వహించారు.

నైలాన్, సింథటిక్ దారాలతో తయారైన ఈ చైనా మాంజా వాడటం వల్ల పక్షులు, పశువులు, సాధారణ ప్రజలు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులకు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. గాలిపటాలు ఎగరేసే సమయంలో అనేక పక్షులు6 తీవ్రంగా గాయపడిన సందర్భాలు ఉన్నాయి. చైనా మాంజాను విక్రయించినా, వినియోగించినా ఏడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎస్సై మహేష్ కుమార్ దుకాణ సముదాయ వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.