16 April, 2026 | 6:40 AM

హైదరాబాద్ ఫేజ్-2 మెట్రో డీపీఆర్ అందింది

19-06-2025 12:57 AM
  1. డీపీఆర్‌ను పరిశీలిస్తున్నాం
  2. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్

హైదరాబాద్, జూన్ 18 (విజయక్రాంతి): హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 కోసం తెలంగాణ ప్రభుత్వం పంపించిన డీపీఆర్ ఇటీవలే అందిందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ తెలిపారు. ఈ డీపీఆర్‌ను మంత్రిత్వశాఖ అధికారులు పరిశీలిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఈ అంశంపై కేంద్ర మంత్రి ఖట్టర్‌తో చర్చించారు.

గతంలో రాష్ర్ట ప్రభుత్వం ఇచ్చిన డీపీఆర్‌లో కేంద్ర ప్రభుత్వం చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుని ఈ డీపీఆర్ రూపొందించి ఉంటారని ఖట్టర్ పేర్కొన్నారు. రాష్ర్ట అభివృద్ధికి కేంద్రం నిరంతరం సహకారం అందిస్తుందని ఆయన కిషన్‌రెడ్డికి తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ పనులకు కేంద్ర ప్రభుత్వ సహకారం అందిస్తుందని వెల్లడించారు.