24 August, 2026 | 11:27 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమం: ఎమ్మెల్యే జారె   •   27న కలెక్టరేట్ ముందు మహాధర్నాను జయప్రదం చేయండి: టిజి ఈజేఏసీ   •   వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి   •   కాసాల–రెడ్డిఖానాపూర్ కూడలిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి   •   వార్డెన్ రమేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పాల్గొన్న విద్యార్థులు   •   భద్రతకు సీసీ కెమెరాలు అత్యంత కీలకం : ఉప్పల్ డిసిపి   •   రేగన్న రాకతో కార్యకర్తల్లో జోష్   •   విరాహత్ అలీని పరామర్శించిన నర్సాపూర్ ఎమ్మెల్యే   •   చెరువులో పడి జీపీ వర్కర్‌ మృతి   •   మంథనికి విద్యుత్ వెలుగులు మరింత పటిష్టం   •  

గర్భిణీని మూడు నెలల్లోపే గుర్తించాలి

19-06-2025 12:59 AM

నల్లగొండ టౌన్, జూన్ 18: మాతా శిశు సంరక్షణ సేవలలో భాగంగా ప్రతి గర్భవతిని మూడు నెలల లోపే గుర్తించి వారికి సరియైన సేవలు సూచనలు చేయాలని డీఎంహెచ్వో  పుట్ట శ్రీనివాస్  సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని  జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో  జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులకు,ఎమ్.ఎల్. హెచ్. పి. లకు, సూపర్వైజర్లకు నిర్వహించిన  సమీక్షా సమావేశంలో మాట్లాడారు.

ప్రస్తుతం ప్రజలకు నీటి ద్వారా, దోమల ద్వారా వచ్చే వ్యాధుల పట్ల   అవగాహన పెంచాలని సూచించారు.  ఈ నెలాఖరులోపు కచ్చితంగా నూటికి నూరు శాతం సేవలు అందించాలని జిల్లాకు మంచి పేరు తేవాలని కోరారు.  కనగల్, పెద్దవూర,  పీ.ఎచ్.సి. లలో మంచిగా సేవలందించినందుకు వైద్యాధికారులను మెచ్చుకున్నారు.

ఈనెల 21 నాడు జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా  ప్రతి సబ్ సెంటర్లో ఆరోగ్య కేంద్రాలలో ఉదయం ఏడున్నర వరకు యోగ డే నిర్వహించాలని సూచించారు. ఇందులో ప్రజలను ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం వహించేటట్టు చూడాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి , డాక్టర్ రవి , డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి , డాక్టర్ అరుంధతి , డాక్టర్ కృష్ణ కుమారి,  డాక్టర్ తిరుపతి రావు, డెమో  విష్ణు, డిపిఓ వైద్యాధికారులు సూపర్వైజర్ సిబ్బంది పాల్గొన్నారు.