calender_icon.png 13 January, 2026 | 7:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతర్జాతీయ సెయిలింగ్‌లో హైదరాబాద్ సత్తా

13-01-2026 02:36:48 AM

ముషీరాబాద్, జనవరి12  (విజయక్రాంతి) : చెన్నై వేదికగా జరిగిన అంతర్జాతీయ సెయిలింగ్ రెగట్టాలో 7 దేశాల నుంచి 48 మంది అగ్రశ్రేణి సెయిలర్లు పాల్గొన్న ఈ పోటీలో హైదరాబాద్‌కు చెందిన యువ సెయిలర్లు బాలుర విభాగం అండర్-14లో రవి కుమార్ బొన్నెలు కాంస్య పతకం, అండర్-18లో మణిదీప్ పేర్కట్ల స్వర్ణ పతకం, బాలికల విభాగంలో శృంగారి రాయ్ రజత పతకం గెలుచుకోగా స్కిఫ్ క్లాస్ విభాగంలో గోవర్ధన్ పల్లారా రజత పతకం సాధించాడని ’ది యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్’ కోచ్ కోచ్ సుహీమ్ షేక్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నలు గురు విజేతలు ఏప్రిల్‌లో చైనాలోని సాన్యాలో జరగబోయే ఆసియా బీచ్ గేమ్స్‌లో భారత్ తరపున పాల్గొననున్నారని తెలిపారు.