13-01-2026 02:35:38 AM
శంషాబాద్, జనవరి ౧౨ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 2వ ఎడిషన్ చీఫ్ మినిస్టర్ కప్ భాగంగా టార్చ్ రిలే కార్యక్రమాన్ని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్ గౌడ్ సోమవారం ప్రారంభించారు. రంగారెడ్డి జికలెక్టర్ సి.నారాయణ రెడ్డి జిల్లా యువజన, క్రీడల అధికారి శఈ. వెంకటేశ్వర రావు, తహసీల్దార్ ,యం. పి.డి. ఓ, మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ), సి.ఐ. హెడ్మాస్టర్, ఫిసికల్ డైరెక్టర్స్ ,ఉపాధ్యాయులు, విద్యార్థులు, కార్యాలయ సిబ్బంది,కోచ్లు, పీడీలు, పీఈటీలు, క్రీడాకారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.