calender_icon.png 13 January, 2026 | 8:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి

13-01-2026 02:38:09 AM

వివేకానంద మాటలు సంకల్ప సాధనకు వజ్రాయుధం

మాజీ ఎంపీ సముద్రాల వేణుగోపాలచారి

ముషీరాబాద్, జనవరి ౧౨ (విజయక్రాం తి): యువత ఆత్మవిశ్వాసంతో ముందు కు సాగాలని మాజీ ఎంపీ సముద్రాల వేణుగోపాల చారి అన్నారు. వివేకానంద మాటలు సంకల్ప సాధనకు వజ్రాయుధమని ఆయన పేర్కొన్నారు.  తెలుగు జాతీయ సారస్వత పరిషత్, ఆది లీల ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో చిక్కడపల్లి లోని   త్యాగరాయ గాన సభలో జరిగిన స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యువకవి సమ్మేళనం,  వివేకానంద స్ఫూర్తి అవార్డుల ప్రధానం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సాంస్కృతిక బంధువు, మాజీ ఎంపీ సముద్రాల వేణుగోపాలాచారి మాట్లాడుతూ నేటి యువత ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లి ఉండాలని స్వామి వివేకానంద యువతకు స్ఫూర్తినిచ్చిన మాటలు చెప్పారు.  నేటి యువ త క్షణిక కావేశంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. సమయాన్ని వృధా చేసుకుం టూ డ్రగ్స్ కు, గంజాయికి వ్యసనంగా మారి  తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. దేశంలో యువశక్తి క్షీణిస్తుందని ఆయ న అభిప్రాయపడ్డారు.  

మరో విశిష్ట అతిథి తెలంగాణా భూ స్వాధీ న కోర్ట్  న్యాయమూర్తి  నర్సిరెడ్డి మాట్లాడు తూ స్వామి వివేకానంద అడిగినట్లుగా నాకు వందమంది యువతను ఇవ్వండి ఈ దేశాన్ని అభివృద్ధి మార్గంలో పెడతాను అన్నారరని గుర్తు చేశారు. ఆత్మీయ అతిథిగా విచ్చేసిన మాజీ బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ రావు  మాట్లాడుతూ యువత వివేకానంద జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలన్నారు. జాతీయ తెలుగు సారస్వత పరిషత్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ రాంప్రసాద్ మాట్లాడుతూ మన తెలు గు భాష గొప్పతనాన్ని తెలియజేశారు. సుమా రు 30 మంది యువకులకు వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారికి వివేకానంద స్ఫూర్తి అవార్డులు ప్రదానం చేశారు.   

ఈ కార్యక్రమంలో న్యూ ఢిల్లీకి చెందిన ఆది లీల ఫౌండేషన్ చైర్మన్ ఆదినారాయణ, జాతీయ తెలుగు సారస్వత పరిషత్ తెలంగాణ విభాగపు అధ్యక్షులు కలిదిండి విశ్వనాథ రాజు, ప్రధాన కార్యదర్శి చంద్రహాస్ ఇప్పలపల్లి, లక్ష సాధన ఫౌండేషన్ చైర్మన్ ప్రజ్ఞా రాజు, తెలుగు భాషా చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు పి.  బడేసాబ్, రామకృష్ణ చంద్రమౌళి    తదితరులు పాల్గొన్నారు.