calender_icon.png 12 August, 2025 | 9:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైడ్రా మార్షల్స్ మెరుపు సమ్మె

12-08-2025 01:33:35 AM

- జీతాల్లో కోత జీవోతో విధుల బహిష్కరణ

- కమిషనర్ రంగనాథ్ హామీతో విరమణ

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 11 (విజయక్రాంతి): జీతాల్లో కోత విధిస్తూ జీవో విడుదల చేసిందన్న వార్తలతో సోమవారం హైడ్రా మార్షల్స్  ఆకస్మికంగా విధులను బ హిష్కరించారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్  వెంటనే రంగంలోకి దిగి, వారితో సమావేశమై చర్చలు జరిపారు. జీహెఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్  విభాగంలో భాగంగా 2020 లో సుమారు 100 మంది మాజీ సైనికులను మార్షల్స్‌గా నియమించారు. ప్రస్తుతం హై డ్రా పరిధిలో పనిచేస్తున్నారు.

అయితే, వీరి జీతాల్లో కోత విధిస్తున్నట్లు ప్రభుత్వం జీవో జారీ చేసిందని మార్షల్స్ ఆరోపిస్తూ సోమవారం విధులు బహిష్కరించారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మార్షల్స్‌తో సమావేశమయ్యారు. సుదీర్ఘ చర్చల అనంతరం వారికి కీలక హామీలు ఇచ్చారు. హైడ్రాలో పనిచేసే ఎవరి జీతాలూ తగ్గించబోమని కమిషనర్ ప్రకటన చేశారు. భవిష్యత్తులో మరింత పెంచుతామని చెప్పా రు. సీఎం దృష్టికి జీతాల పెంపు అంశాన్ని తీసుకెళ్లి, రెండు నెలల్లో సానుకూల నిర్ణయం వచ్చేలా చూస్తానని భరోసా ఇచ్చారు. దీంతో మార్షల్స్ సమ్మె విరమించారు.