13-11-2025 12:00:00 AM
హైదరాబాద్, నవంబర్ 11 (విజయక్రాంతి) : విద్యుత్ శాఖలో అత్యంత కీలకమై న ‘ముఖ్య’ పోస్టు అది.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం తరఫున హాజరై అన్ని అంశాలను పరీక్షించి, తనిఖీ చేసిన తరువాత ఆ అధికారి ఓకే అంటేనే విద్యుత్‌కు సంబంధించిన పనులు మొదలవుతాయి. అనంతరం సద రు అధికారి వచ్చి పచ్చజెండా ఊపితేనే విద్యుత్ యంత్రాలు పరుగులు పెడతాయి.. అలాంటి ముఖ్యమైన అధికారి.. కీలకమైన నిర్ణయం తీసుకున్నారు.. ఒక ఫైలును క్లియర్ చేయాలంటే ఐదు లక్షలు ఇచ్చుకోవాలని హుకుం జారీ చేశాడు.
దీనితో దరఖాస్తుదారులందరూ ఐదు లక్షలు పుచ్చుకుని క్యూ కడుతున్నారు. అన్నీ నిబంధనల ప్రకారం ఉంటే.. లంచం ఎందుకు ఇవ్వాలంటూ ఎదురు తిరిగిన వారి ఫైళ్లు మాత్రం రిజెక్ట్ అవుతున్నాయి. ఇదీ విద్యుత్ శాఖలో తాజా పరిస్థితి.
కిటికీలు కాదు.. తలుపులే..
వాస్తవానికి విద్యుత్ శాఖకు సంబంధించిన కీలకమైన పదవి అది. రాష్ట్రంలో ఎలాంటి విద్యుత్‌కు సంబంధించిన పనులు జరగాలన్నా.. అది ప్రైవేట్ అయినా.. ప్రభు త్వం తరఫున అయినా. ఈ అధికారి సంత కం పడాల్సిందే. తనిఖీ చేసి పచ్చజెండా ఊపితేనే పూర్తయిన యంత్రాలు నడుస్తా యి. అందుకే ఆ స్థాయి డిమాండ్. కొద్ది కాలం క్రితం ప్రభుత్వంలో కీలకమైన వారిని పట్టుకుని సదరు అధికారి ఆ పోస్టింగుకు వచ్చా డు. ఇంకేం రావడంతోనే... కిటికీలు ఏం ఖర్మ.. ఏకంగా తలుపులే బార్లా తెరిచా రు.
ఎవరో వచ్చి.. సార్ పనిచేయండని అడగటం.. ఇంత ఇస్తే.. పని అవుతుందని బేరసా రాలాడటం.. ఆయనకు చాలా చికాకు తెప్పించాయి. దీనితో పనిని బట్టి అని కాకుం డా.. ఫైలుకు ఇంత అని ఆయనే ధరను నిర్ణయించారని విద్యుత్ శాఖ ఉద్యోగులే గగ్గోలు పెడుతున్నారు. సాధారణంగా ఏ ఆఫీసులోకి వెళ్లినా.. కింది నుంచి పైస్థాయి వరకు అనేది చాలా విభాగాలు, శాఖల్లో మామూళ్లు తీసుకుంటారు. కానీ ఈ ‘ముఖ్య’ అధికారి మా త్రం.. మిగతావారితో సంబంధం లేదు.. కేవ లం నా దగ్గరికి వచ్చిన ఫైలును క్లియర్ చేయాలం టే ఐదు లక్షలు సమర్పించుకోవాల్సిందేనంటూ హుకుం జారీ చేసినట్లు తెలిసింది.
ప్రతియేటా సగటున 2500 ఫైళ్లు..
రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ఒక్క పోస్టు గనుక.. రాష్ట్రంలో ఎక్కడ పని జరగాలన్నా ఫైలు మా త్రం ఈయన కార్యాలయానికి రావాల్సిందే. ఎలాంటి ఫ్యాక్టరీ, థియేటర్ , ఆస్పత్రి అయి నా... ఇలా లెక్కపెట్టుకుంటూ వెళితే.. అన్ని ప్రధానమైన సంస్థలకూ.. ఆఖరికి బహుళ అంతస్తుల ఆఫీసులు, రెసిడెన్షియల్ అయి నా.. సదరు ఆఫీసరు తనిఖీ చేయాల్సిందే. ఫైలు క్లియర్ చేయాల్సిందే.
ఇలా ప్రతియేటా సుమారు 2000 నుంచి 3000లకుపైగా ఫైళ్లు సదరు అధికారి కార్యాలయానికి వస్తుంటాయి. ఇవన్నీ స్వయంగా తనిఖీ చేసి, పరిశీ లించి పూర్తి చేయాల్సిన ఫైళ్లన్నమాట. ఇలా గడిచిన రెండు నెలల్లో సదరు అధికారి మొ త్తం 70 ఫైళ్లను క్లియర్ చేశారని విద్యుత్ సంస్థల్లోని ఉద్యోగులు చెవులు కొరుక్కుంటున్నారు.
భారీ ఆదాయం..
ఒక విద్యుత్ సంస్థలో పనిచేసే ఉద్యోగి.. ప్రభుత్వంలో కీలకమైన ప్రతినిధి అండతో.. ఈ ముఖ్యమైన పోస్టింగులోకి వచ్చినట్టుగా అటు సచివాలయంలో, ఇటు విద్యుత్ సంస్థల్లోనూ చెప్పుకుంటున్నారు. దీనితో వచ్చీరా వడంతోనే ‘మామూలు’ వ్యవహారాలను చక్కదిద్దారని, అప్పటి వరకు ఉన్న బేరసారాలను పక్కనపెట్టి.. ఫైలు ఇంత అనేలాగా ఎంఆర్‌పీ నిర్ణయించడంతో ఆయన కార్యాలయంలోని ఉద్యోగులు నెత్తినోరూ మూసు కుని పనిచేస్తున్నట్టుగా బయట చర్చలు జరుగుతున్నాయి.
ఐదు లక్షలు ఉంటేనే ఫైలుకు మోక్షం అంటూ నిర్ధారించడంతో.. ఫైలుదారులు కూడా దీనికి సిద్ధపడే వస్తున్నారు. ఇలా రెండు నెలల్లో సుమారు 70 ఫైళ్లు క్లియర్ చేశారని చెప్పుకుంటున్నారు. అంటే ఎంత లేదన్నా రెండు నెలల్లో ఆ ముఖ్య అధికారి ఆదాయం రూ. 3.5 కోట్లన్నమాట. ఇక సంవత్సరం మొత్తంపై ఆయన ఆదాయం గుణిస్తే.. కండ్లు బైర్లు తిరగడం ఖాయం.
ఆంధ్రా మూలాలు.. తెలంగాణలో పోస్టింగు..
వాస్తవానికి సీఈ క్యాడర్ పోస్టు అయిన ఆ ముఖ్య స్థానానికి తెలంగాణలోనే ఎందరో అధికారులు ఉన్నారు. కానీ ఆంధ్రా మూలాలున్న సదరు అధికారి కృష్ణుడిలా చక్రం తిప్పి.. ప్రభుత్వపెద్దలను ప్రసన్నం చేసుకుని ఈ పోస్టులోకి వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. తెలంగాణలో కీలకమైన పోస్టులోకి ఆంధ్రా మూలాలున్న అధికారిని కూర్చోబెట్టడంపై విద్యుత్ ఉద్యోగ, కార్మిక సంఘాలు కూడా మొదట్లో భగ్గుమన్నాయి.
తీవ్రంగా చర్చించుకున్నారు. అయితే ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతోనే ఆ పోస్టులోకి వచ్చారని తెలుసుకుని ఊసూరుమంటున్నారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తరువాత కూడా తెలంగాణ అధికారులకు అవకాశాలు ఇవ్వకుండా.. ఇప్పటికీ.. ఆంధ్రా మూలాలున్న అధికారులకే అందలం ఎక్కించడం వెనుక..
చాలా పెద్ద తతంగమే నడిచిందని ఉద్యోగుల్లో చర్చ సాగుతోంది. మొత్తానికి ఈ పోస్టింగు కారణంగా తెలంగాణలోని విద్యుత్ సంస్థల ఉద్యోగులు, కార్మికుల్లో ప్రభుత్వంపై ఒకింత విసుగు, అసంతృప్తి కనపడుతోంది. దీనిని సరిచేయాల్సిన ప్రభుత్వం ‘మామూలు’గా తీసుకుంటుందా.. లేక సరిదిద్దుతుందా వేచి చూడాల్సిందే..!