01-05-2025 01:21:50 AM
దేవరయాంజల్, కండ్లకోయ ప్రజలకు సులభంగా వెళ్లే వెసులుబాటు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 30(విజయక్రాంతి) : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా షామిర్‌పేట మండలం దేవరయాంజల్ గ్రామానికి వెళ్లే ప్రధాన రోడ్డుకు అడ్డంగా బండకుంట నరసింహారెడ్డి అనే వ్యక్తి పెట్టిన గేట్లను హైడ్రా సిబ్బంది బుధవారం తొలగించారు. అడ్డంగా వేసిన బండరాళ్లను తొలగించారు, కందకం మాదిరిగా తొవ్విన చోట మట్టిని నింపి రాకపోకలను పునరుద్ధరించారు.
దేవరయాంజల్, కండ్లకోయ ప్రజలు సులభంగా 44వ నవంబర్ జాతీయ రహదారికి వెళ్లే వెసులుబాటు కలిగింది. హైడ్రా చర్యలతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. కాగా దేవరయాంజల్ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిని మూసేశారని, దీంతో ఇబ్బందులు కలుగుతున్నట్లు ఇటీవల స్థానికులు హైడ్రాను ఆశ్రయించారు. వారం రోజుల్లోనే సమస్యకు పరిష్కారం కలగడంతో హైడ్రాకు స్థానికులు ధన్యవాదాలు తెలిపారు.