26 March, 2026 | 1:55 PM

Breaking News

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి   •   అంజన్న హుండీ లెక్కింపు ప్రారంభం   •   బీఆర్ఎస్ హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ దుర్వినియోగం.. ఎవరు కాజేశారో తెలుసు!   •   మార్కాపురం బస్సు అగ్నిప్రమాదం — 13 మంది సజీవ దహనం, హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే!   •   మార్కాపురం బస్సు దుర్ఘటనపై మోదీ సంతాపం — 14 మంది మృతికి రూ.2 లక్షల పరిహారం!   •   దావోస్ పెట్టుబడులపై అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు సమాధానం   •   మార్కాపురం బస్సు ప్రమాదంపై స్పందించిన కేంద్రమంత్రులు   •   మార్కాపురం బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి   •   కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిసిన జాతీయ ఆర్ఎంపీ, పీఎంపీ జేఏసీ నాయకులు   •   డ్రైవర్ నిర్లక్ష్యంతో నరకం — మార్కాపురంలో 13 మంది సజీవ దహనం, డ్రైవర్ పరారు!   •  

జొన్నబండ పార్కును కాపాడిన హైడ్రా

09-01-2026 12:58 AM

1444 గజాల పార్కు చుట్టూ హైడ్రా ఫెన్సింగ్

సికింద్రాబాద్ జనవరి 8 (విజయ క్రాంతి): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఓల్ ఆల్వాల్ పరిధి, జొన్నబండలోని ఎంహెచ్‌ఆర్ కాలనీలో పార్కును హైడ్రా గురువారం కాపాడింది. 1444.40 గజాల పార్కు స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసింది. లే ఔట్ ప్రకారం సర్వే నంబర్లు 575, 576 (పార్ట్), 577, 578 (పార్ట్), 598 మరియు 580 (పార్ట్)లలో మొత్తం 1444.40 గజాల స్థలాన్ని పార్కు కోసం కేటాయించారు. దీనిని ఆక్రమించేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యా దు చేశారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు సంబంధిత అధికారులతో క్షేత్ర స్థాయిలో హైడ్రా పరిశీలించింది. చెత్త వేయకుండా పార్కుగా అభివృద్ధి చేయాలని జీహెచ్ఎంసీని కోరుతామన్నారు.