calender_icon.png 10 January, 2026 | 8:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రణాళికబద్ధంగా గ్రామాలను అభివృద్ధి చేస్తాం

09-01-2026 12:59:21 AM

చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య

శంకర్ పల్లి; జనవరి 8: ప్రణాళిక బద్ధంగా గ్రామాలను అభివృద్ధి చేస్తామని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. గురువారం శంకర్ పల్లి మండలంలోని పలు గ్రామాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. లక్ష్మారెడ్డి గూడ గ్రామంలో 25 లక్షల నిధులతో నిర్మిస్తున్న సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. గాజుల గూడా గ్రామంలో 25 లక్షల నిధులతో నిర్మిస్తున్న సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అంతప్ప గూడ గ్రామంలో 25 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సిసి రోడ్డు పనులను శంకుస్థాపన చేశారు,

గ్రామంలో ఏర్పాటు చేసిన వీధిదీపాలను ప్రారంభించారు. కొత్తపల్లి గ్రామంలో  25 లక్షల రూపాయలతో  నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి గ్రామంలో వీధి దీపాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు కలిసి మెలిసి ఉంటూ గ్రామాలను మరింత అభివృద్ధి చేయాలని సూచించారు.

గ్రామాలలో పారిశుద్ధంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పాటుపడుతున్నదని తెలిపారు. కార్యక్రమంలో శంకర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చేకూర్త గోవిందమ్మ గోపాల్ రెడ్డి. గాజుల గూడా సర్పంచ్ అనూష ప్రశాంత్ రెడ్డి, లక్ష్మారెడ్డి గూడ సర్పంచ్ దివ్య గోవర్ధన్, అంతప్ప గూడ సర్పంచ్ బీరయ్య, కొత్తపల్లి గ్రామ సర్పంచ్ బలవంత రెడ్డి, పర్వేద సర్పంచ్ సురేందర్ గౌడ్, మాజీ ఎంపిటిసి బొల్లారం వెంకటరెడ్డి, గోపులారం మాజీ సర్పంచ్ పొడవు శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ దశరథ్, నాయకులు చేకూర్త గోపాల్ రెడ్డి, కె. గోపాల్, గ్రామస్తులు, పార్టీ అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

మున్సిపాలిటీల అభివృద్ది కృషి

చేవెళ్ల, జనవరి 8, (విజయ క్రాంతి):  చేవెళ్ల నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీలకు రూ.15 కోట్ల చొప్పున మంజూర య్యాయని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చేవెళ్ల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు.

నియోజకవర్గంలోని చేవెళ్ల, శంకర్పల్లి, మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలకు రూ.15కోట్ల చొప్పున నిధులు మంజూరయ్యాయని, ఈనెల 12వ తేదీన పలు శంకుస్థాపన కార్యక్రమాలకు మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డిలు హాజరవుతున్నారని, మొయినాబాద్ మండలంలోని కావలిగూడ చందనగర్ రోడ్డుకు రూ.35కోట్లు, అదేవిధంగా చేవెళ్లలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి మంత్రులు శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు.

దశలవారిగా మున్సిపాలి టీలను, గ్రామాలను అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర పొలూష్యన్ కంట్రోల్ బోర్డు మెంబర్ చింపుల సత్యానారాయణరెడ్డి, మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు లొంక శ్రీనివాస్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు బండారు ఆగిరెడ్డి, చేవెళ్ల, ముడిమ్యాల సోసైటి మాజీ చైర్మెన్లు దేవర వెంక ట్రెడ్డి, గోనె ప్రతాల్రెడ్డి, పంచాయతీ ఛాంబర్ జిల్లా గౌరవ అధ్యక్షులు రెడ్డిశెట్టి మధుసూదనుప్తా, మండల అధ్యక్షులు వీరేందర్రెడ్డి, మున్సిపల్ అధ్యక్షులు బి.శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మెన్, వైస్ చైర్మెన్ గడ్డమీది పెంటయ్యగౌడ్, బ్యాగరి రాములు, నాయకులు, సర్పంచులు ఉన్నారు.

ప్రజలతో మమ్మేకంగా ఉండాలి..

ప్రజలతో మమ్మేకంగా ఉండి ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య సర్పంచులకు సూచించారు. చేవెళ్ల మండల సర్పంచుల సంఘం నూతన కమిటీ సభ్యులను సన్మానించి అభినందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లా డుతూ.. కొత్తగా గెలిచిన సర్పంచులు గ్రామాల్లోని ప్రతి వార్డుల్లో తిరిగి ప్రజాసమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని సూచించారు. పేదల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటే ప్రజలు గుర్తిస్తారని తెలిపారు.

ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో ఏ వార్డుల్లో సమస్యలు పరిష్కరించాలని గ్రామస్థులు, వార్డు సభ్యులతో చర్చించుకోవాలని సూచించారు. ప్రజలతో మమ్మేకంగా ఉండి ప్రజల సమస్యలు మన సమస్యగా తీర్చాలన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సహకారంతో నియోజకవరానికి పెద్ద ఎతున్న నిదులు తీసుకొచ్చి పరిష్కరించాలని సూచించారు.

పేదల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటే ప్రజలు గుర్తిస్తారని తెలిపారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో ఏ వార్డుల్లో సమస్యలు పరిష్కరించాలని గ్రామస్థులు, వార్డు సభ్యులతో చర్చించుకోవాలని సూచించారు. ప్రజలతో మమ్మేకంగా ఉండి ప్రజల సమస్యలు మన సమస్యగా తీర్చాలన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సహకారంతో నియోజకవర్గానికి పెద్ద ఎత్తున్న నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ఈనెల 12న నియోజకవర్గంలోని సర్పంచులకు సన్మాన కార్యక్రమం ఉంటుందన్నారు.

అనంతరం నూతనంగా ఎన్నికైన మండల సర్పంచుల అధ్యక్షులు లొంక శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. సర్పంచుల సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానని, గ్రామాలాభివృద్ధికి సర్పంచులకు నిధులు మంజూరు అయ్యేలా ఎమ్మెల్యే కాలె యాదయ్య సహకారంతో కృషి చేస్తానన్నారు. నాపై నమ్మకంతో అధ్యక్షపదవి ఇచ్చిన పెద్దలకు రుణపడి ఉంటానని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అందరిని కలుపుకుని పనిచేస్తానన్నారు.

ఈ పదవి నాకు మరింత బాధ్యత పెంచిందన్నారు. రాష్ట్ర పొలూష్యన్ కంట్రోల్ బోర్డు మెంబర్ చింపుల సత్యానారాయణరెడ్డి, మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు లొంక శ్రీనివాస్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు బండారు ఆగిరెడ్డి, చేవెళ్ల, ముడిమ్యాల సోసైటీ మాజీ చైర్మెన్లు దేవర వెంకట్రెడ్డి, గోనె ప్రతాప్రెడ్డి, పంచాయతీ ఛాంబర్ జిల్లా గౌరవ అధ్యక్షులు రెడ్డిశెట్టి మధుసూదనుప్తా,

మండల అధ్యక్షులు వీరేందర్రెడ్డి, మున్సిపల్ అధ్యక్షులు బి.శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మెన్, వైస్ చైర్మెన్ గడ్డమీది పెంటయ్యగౌడ్, బ్యాగరి రాములు, కుమ్మెర ఉపసర్పంచ్ పాండుగౌడ్, సీనియర్ నాయకులు జనార్దన్రెడ్డి, బల్వంత్రెడ్డి, చేవెళ్ల సొసైటీ మాజీ డైరెక్టర్ ఫైండ్ల మధుసూదన్రెడ్డి, మాజీ సర్పంచులు దావల్గారి గోపాల్రెడ్డి, జహంగీర్, పడాల ప్రభాకర్, నాయకులు ఉన్నారు.