calender_icon.png 8 November, 2025 | 12:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా

08-11-2025 12:00:00 AM

  1. పోచారం మున్సిపాలిటీలో 400 గజాల్లో కూల్చివేతలు
  2. శ్రీనివాస కాలనీవాసుల హర్షం

ఘట్‌కేసర్, నవంబర్ 7 (విజయక్రాంతి): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ చౌదరిగూడ సర్వే నంబర్ లు 726, 727, 729లలో 400 గజాల పార్కు స్థలాన్ని రియల్టర్ల కబ్జాకు గురైంది. దీంతో శ్రీనివాస కాలనీవాసులు హైడ్రాను ఆశ్రయించారు. స్పందిం చిన హైడ్రా అధికారులు కబ్జాకు గురైన పార్క్ స్థలంలో శుక్రవారం కూల్చివేతలు చేపట్టి హైడ్రా బోర్డులు ఏర్పా టు చేశారు. తమ పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా అధికారుల చర్యకు శ్రీనివాస కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలియజేశారు.