calender_icon.png 8 November, 2025 | 7:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి

08-11-2025 12:00:00 AM

ఆదిలాబాద్, నవంబర్ 7 (విజయక్రాంతి) : రాష్ట్రంలో విద్యార్థులకు రావలసిన ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో పేద, మధ్య తరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఏబీవీపీ ఇందూరు విభాగ్ కన్వీనర్ కైరి శశిందర్ అన్నారు.  శుక్రవారం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న రూ. 8500 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయాలని స్థానిక వినాయక చౌక్ లో రాస్తారోకో చేపట్టారు.

దీంతో భారీగా ట్రాఫిక్ జాం అయింది. ఈ సందర్భంగా ఇందూరు విభాగ్ కన్వీనర్ కైరి శశిందర్  మాట్లాడుతూ... స్కాలర్షిప్,  ఫీజు రీయింబర్స్‌మెంట్ అనేది విద్యార్థుల హక్కు అని, ప్రభుత్వం ఇచ్చే బిక్ష కాదని, దిన్ని పాలకులు  గుర్తుపెట్టుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వినర్ నిఖిల్, ఆదిత్య, రాజ్, కిరణ్, పృథ్వి, సాయి, రంజిత్, వరుణ్, శ్రీధర్, వర్ధన్, విగ్నేష్, సాయికుమార్ పాల్గొన్నారు.