08-11-2025 12:00:00 AM
మంచిర్యాల, నవంబర్ 7 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా రవాణ శాఖ అధికారిగా గోపికృష్ణ శుక్ర వారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ డీటీఓగా విధులు నిర్వహించిన కిష్ట య్య 2024, ఫిబ్రవరి 19న బదిలీపై వెళ్లగా ఆయన స్థానంలో ఇంఛార్జీ డీటీఓగా సీనియర్ ఎంవీఐ సంతోష్ కుమార్ బాధ్యతలు చేపట్టారు.
20 నెలల అనంతరం రెగ్యూలర్ డీటీఓగా గ్రూప్ వన్ నుంచి నేరుగా మంచిర్యాల జిల్లా డీటీఓగా నియామకమై ఇంఛార్జీ డీటీఓ సంతోష్ కుమార్ నుంచి డీటీఓగా బాధ్యతలు తీసుకున్నారు. నూతనంగా డీటీఓగా బాధ్యతలు చేపట్టిన గోపికృష్ణకు ఎంవీఐలు తుల్సిరాం సంతోష్ కుమార్, కిశోర్ చంద్రా రెడ్డి, రంజిత్ లతో పాటు ఏఎంవీఐలు ఖాసీం, సాయి లెనిన్, సూర్యతేజలు మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.