26-07-2025 12:17:27 AM
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ యష్‌రాజ్ ఫిల్మ్స్ (వైఆర్‌ఎఫ్) బ్యానర్‌పై అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘వార్2’. ఇందులో కియారా అద్వానీ కథానాయిక. భారతీయ చిత్ర పరిశ్రమలోని ఇద్దరు ఐకానిక్ యాక్టర్స్ హృతిక్ రోషన్, ఎన్టీఆర్.. నువ్వా నేనా అన్నట్టు పోటీ పడి నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. అంతేకాదు ఈ నట ద్వయం తమ 25 ఏళ్ల నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న సంవత్సరమిది.
ఈ సందర్భాన్ని సెలబ్రేట్ చేస్తూ శుక్రవారం ‘వార్2’ ట్రైలర్‌ను విడుదల చేసింది వైఆర్‌ఎఫ్. ‘నేను ప్రమాణం చేస్తున్నాను.. నేను పేరుని, గుర్తింపుని, ఇంటిని, కుటుంబాన్ని.. అన్నింటినీ వదిలేసి ఒక నీడలాగా మారిపోతాను..’ అంటూ హృతిక్ డైలాగ్స్ ఒకవైపు.. ‘ఇప్పుడు నేను మనిషి కాను. యుద్ధంలోని ఆయుధాన్ని.. చస్తా లేదా చంపుతా..’ అంటూ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఆగస్టు 14న విడుదల కానుంది.