calender_icon.png 27 July, 2025 | 3:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్క్.. లైఫ్.. బ్యాలెన్స్‌గా ఉండేది అప్పుడే!

26-07-2025 12:18:58 AM

వర్క్ లైఫ్ బ్యాలె న్స్.. ప్రస్తుతం చిత్రపరిశ్రమలో హాట్ టాపిక్. దీపికా పడుకొణె ‘స్పిరిట్’ నుంచి తప్పుకోవడానికి చెప్పిన ప్రధాన కారణమూ ఇదే. 8 గంటలు పనిచేయాలన్న దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా ప్రతిపాదనను దీపికా తిరస్కరించిన నేపథ్యంలో ఈ అంశం ఆసక్తికర చర్చకు దారి తీసింది. తాజాగా ఇదే విషయమై తమన్నా భాటియా స్పందించింది. ఇటీవల జరిగిన ‘ఇండియన్ కౌచర్ వీక్ పాల్గొన్న తమన్నా చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.

“వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌ను నేను నమ్మను. మనలో ఉండే ఇన్నర్ బ్యాలెన్స్‌ను మాత్రమే నేను నమ్ముతాను. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది అబద్ధమనేది నా అభిప్రాయం. మనం బ్యాలెన్స్‌గా ఉంటే ఆ తర్వాత వర్క్, లైఫ్ బ్యాలెన్డ్స్‌గా ఉంటాయి” అని చెప్పుకొచ్చింది తమన్నా. ఇక ఈ ‘ఇండియన్ కౌచర్ వీక్’లో తమన్నా మునుపటి కంటే అందంగా కనిపిస్తోందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ‘వర్క్ లైఫ్ బ్యాలెన్స్’పై తన వ్యక్తిగత అభిప్రాయాలను చాలా నిజాయితీగా వెల్లడించిందని తమన్నాను ప్రశంసిస్తున్నారు.