04-07-2024 01:29:08 AM
అమెరికా అధ్యక్షుడు, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్
అట్లాంటాలో ఎన్నికల చర్చలో పాల్గొన్న బైడెన్, ట్రంప్
విరాళాల సేకరణలో బైడెన్‌ను దాటేసిన ట్రంప్
వాషింగ్టన్, జూలై 3: ట్రంప్‌తో అట్లాంటాలో జరిగిన ఎన్నికల చర్చా కార్యక్రమంలో తాను నిద్రపోయినట్లు అమెరికా అధ్యక్షుడు, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ తెలిపారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి 78 ఏళ్ల డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది నవంబర్ 5న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 81 ఏళ్ల జోబైడెన్‌తో పోటీ పడనున్నారు. ఈ క్రమంలో మంగళవారం జార్జియాలోని అట్లాంటాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల చర్చలో వారివురు మాట్లాడారు.
ఈ చర్చలో బైడెన్ తేలిపోవడంతో విమర్శల పాలయ్యారు. దీనిపై స్పందించిన ఆయన ప్రయాణ ఒడలిక వలన చర్చ సమయంలో నిద్రమత్తు వచ్చిందని తెలిపారు. అయితే ఈ ఏడాది రెండో త్రైమాసికంలో ట్రంప్ 331 మిలియన్ డాలర్లు సేకరించడం ద్వారా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌పై 67 మిలియన్ డాలర్ల పైచేయి సాధించాడు. అయితే బైడెన్ ప్రచారం జూన్ నెల లో ట్రంప్‌ను మించిపోయింది. జూన్ 27న అట్లాంటాలో జరిగిన మొదటి అధ్యక్ష చర్చ ద్వారా 38 మిలియన్ డాలర్లు సేకరించారు.
మా నిబద్ధతను తెలియజేస్తోంది..
మా నిధుల సేకరణ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ వెనుక నిలుచున్న మద్దతుదారుల నిబద్ధత, దృడత్వాన్ని తెలియజేస్తుందని బైడెన్ 2024 ప్రచార కార్యక్రమ మేనేజర్ జూలీ చావెజ్ తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని బ లోపేతం చేసేందుకు పోరాడుతున్నారన్నారు.