04-07-2024 01:30:11 AM
మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ కూడా..
కేజ్రీవాల్ కస్టడీ 12వ తేదీ వరకు పొడిగింపు
న్యూఢిల్లీ, జూలై 3: ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు జూలై 25 వరకు పొడిగించింది. ఈ కేసులోనే అరెస్టయ్యి జైల్లో ఉన్న మనీశ్ సిసోడియా కస్టడీ కూడా 25 వరకు పొడిగిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి తీర్పు చెప్పారు. మనీ లాండరింగ్ కేసులో వీరి జ్యుడీషియల్ కస్టడీ ముగియటంతో తీహార్ జైలు నుంచే వర్చువల్‌గా కోర్టులో హాజరుపరిచారు. దీంతో ఇద్దరి కస్టడీని పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీచేసింది.
కేజ్రీవాల్‌కు 12 వరకు కస్టడీ
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కస్టడీని కూడా కోర్టు పొడిగించింది. కేజ్రీ కస్టడీని 12 వరకు పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీచేసింది. కేజ్రీవాల్ ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు ఏప్రిల్ 22న ఏర్పాటుచేసిన ఎయిమ్స్ వైద్యుల బృందం తన సతీమణి సునీత సమక్షంలోనే తనకు వైద్య పరీక్షలు నిర్వహించాలన్న కేజ్రీవాల్ పిటిషన్‌పై 6న తీర్పు చెప్తామని కోర్టు వెల్లడి ంచింది. సీబీఐ తనను వేధిస్తుందని ఆరోపిస్తూ.. సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.