calender_icon.png 12 January, 2026 | 9:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏకశిలానగర్ వెంచర్‌తో నాకు సంబంధం లేదు

12-01-2026 12:00:00 AM

హర్ష కన్ స్ట్రక్షన్ సంస్థ ఎండీ అలూరి వెంకటేశ్వర్ రావు

ఘట్ కేసర్, జనవరి 11 (విజయక్రాంతి): ఏకశీల నగర్ వెంచర్ తో నాకు ఇలాంటి సంబంధం లేదని  హర్ష కన్ స్ట్రక్షన్ సంస్థ ఎండీ అలూరి వెంకటేశ్వర్ రావు తెలిపారు. ఏకశిలా వెంచర్ వివాదంపై ఆదివారం సాయంత్రం ఆయన ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. కొర్రెముల రెవెన్యూ పరిదిలోని 739, 740, 741,1742 లలోని 47 ఎకరాల 25 గుంటల భూమిని చట్టబద్ధంగా  కొనుగోలు చేశానని, దీనికి సంబందించి పట్టాదారు పాసుప్తకాలు ఉన్నాయన్నారు. నా సర్వేనెంబర్లు ఉన్న భూమిలో ఎప్పుడూ  వెంచర్ చేయలేదన్నారు. ఏకశీలనగర్ వెంచర్ కు సంబంధించిన సర్వేనెంబర్లు 743, 744, 745, 746, 747లలోని 64 ఎకరాల 32 గుంటల భూమి.

నా సర్వేనెంబర్లు వేరు ఏకశీలనగర్ వెంచర్ సర్వేనెంబర్లు పూర్తిగా వేరని, కొంతమంది కావాలనే నా భూమిలోకి అక్రమంగా ప్రవేశించి ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు పేర్కొన్నారు. 739లో తిరుమల్ నగర్ వెంచర్, 748, 749లలో చైతన్యనగర్ వెంచర్ అలాగే 748, 750లలో లక్ష్మణ్ రావు, జములాద్దీన్ వెంచర్లు ఉన్నాయని తెలిపారు. 748, 749ల్లో సిద్ధార్థ కళాశాల ఉందని, మరోవైపు సీలింగ్ ల్యాండ్, ఖాళీ భూమి ఉంది.

కాని కొంతమంది నాపై కక్ష్యగట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని, నా భూమికి సంబం ధించిన అన్ని కేసుల్లో జడ్జిమెంట్ నావైపే వచ్చిందన్నారు. నా భూమికి సంబంధించిన రెవెన్యూకు సంబందించిన సర్వే రిపోర్టులు అన్ని ఉన్నాయన్నారు. 739-742లలోని 47 ఎకరాల 25 గుంటలకు సంబందించిన భూమిలో ఒక్క సేల్ ఉంటే చూపాలని, నేను భూమిని కొనుగోలు చేసిన తరువాత అయినా ఒక్క ప్లాట్ సేల్డీడ్ ఉంటే నేను దైనికై సిద్ధమన్నారు. అయినా పనిగట్టుకొని కొంతమంది ఇబ్బందులకు గురిచేస్తున్నారని హర్ష కన్ స్ట్రక్షన్ సంస్థ ఎండీ అలూరి వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు.