calender_icon.png 12 January, 2026 | 8:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువత క్రీడల్లో రాణించాలి

12-01-2026 12:00:00 AM

రాజాపూర్ జనవరి 11: సమాజంలోని ప్రస్తుతం యువత క్రీడల్లో రాణించాలని పలువురు నాయకులు పేర్కొన్నారు. ముదిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని నందిగామ గ్రామంలో శనివారం ఆదివారం గ్రామ యువకుల ఆధ్వర్యంలో నందిగామ ప్రీమియర్ లీగ్ -5 క్రికెట్ క్రీడా పోటీలు అట్టహాసంగా నిర్వహించారు. క్రీడల్లో గెలుపొందిన జట్లకు మొదటి బహుమతిగా రూపాయలు 20 వేలు,ద్వితీయ బహుమతిగా 10వేలు,తృతీయ బహుమతిగా 5వేలు అందజేశారు.

ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ సమాజంలో క్రికెట్ యువకులకు  బాగా అలవాటు అయిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచులు పెంటయ్య, బచ్చిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపిటిసి శేఖర్ గౌడ్, మాజీ ఉపసర్పంచ్ వెంకటయ్య గౌడ్, శేఖర్ రెడ్డి, ఆంజనేయులు, ఎల్లయ్య, అచ్చయ్య వెంకటేష్ , డాక్టర్ వెంకటేశ్వరరావు, శ్రీనివాస్, చిన్న కృష్ణ, జీవన్, రాఘవేందర్, కుమారు, మల్లేష్, క్రికెట్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.