calender_icon.png 12 January, 2026 | 7:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమష్టిగా ఉండి అభివృద్ధి చేసుకుందాం

12-01-2026 12:00:00 AM

పార్టీల చేరిన ప్రతి ఒక్కరి సంక్షేమానికి పాటుపడతాం

దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి

భూత్పూర్, జనవరి 11: అందరం సమిష్టిగా ఉండి అభివృద్ధి చేసుకుందామని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. ఆదివారం భూత్పూర్ మండల పరిధిలోని తాటికొండ గ్రామంలోని బీఆర్‌ఎస్ పార్టీకి సంబంధించిన ఉపసర్పంచ్, పదిమంది వార్డు సభ్యులు ఎమ్మెల్యే,కాంగ్రెస్ నాయకులు మన్నె జీవన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి ఎమ్మెల్యే ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఇంటికి ప్రతి నెల సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మన ప్రజాపాలన ప్రభుత్వమని స్పష్టం చేశారు. మహిళలకు కేవలం ఆధార్ కార్డు తోనే ఉచిత ప్రయాణాలు కల్పించడం ఎంతోమందికి ఉపయోగకరంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ కల్పన శ్రీధర్ రెడ్డి తదితరులు ఉన్నారు.