9 April, 2026 | 7:52 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

చెల్లెలిపై పోటీ చేయించి తప్పుచేశా

14-08-2024 03:37 AM

రాజకీయాలను ఇంటి వరకు రానివ్వకూడదు n మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్

ముంబై, ఆగస్టు 13: రాజకీయాలను ఇంటి వరకు రానివ్వకూడదని మహా రాష్ట్ర డిప్యూటీ సీఎం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత లోక్‌సభ ఎన్నికల్లో బారా మతి స్థానం నుంచి సోదరి సుప్రియ సూలేపై తన భార్య సునేత్ర పవార్‌ను పోటీలో నిలపడం తప్పేనని వ్యాఖ్యా నించారు. త్వరలో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యం లో రాష్ట్రవ్యాప్తంగా ‘జన సమ్మాన్ యాత్ర’ నిర్వహిస్తున్న ఆయన మంగళవారం ఓ న్యూస్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.

‘నా సోదరీమణులంటే నాకు ఎంతో ఇష్టం. సుప్రియపై సునేత్రను పోటీకి నిలిపి తప్పు చేశాను. ఎన్సీపీ పార్ల మెంటరీ పార్టీ బోర్డు తీసుకున్న నిర్ణయం మేరకు పోటీకి దింపాల్సి వచ్చింది’ అని అజిత్ పవార్ వ్యాఖ్యా నించారు. అయితే, రక్షాబంధన్ వస్తు న్నందున సుప్రియను కలుస్తారా అని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించగా అవకాశం ఉంటే తప్పకుండా కలుస్తానని తెలిపారు. కాగా, గతేడాది ఎన్సీపీలో చీలిక వచ్చిన విషయం తెలిసిందే.