calender_icon.png 14 December, 2025 | 12:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

13-12-2025 12:51:41 AM

తుర్కయంజాల్, డిసెంబర్ 12: తుర్కయంజాల్ సర్కిల్లో పనిచేస్తున్న 48మంది కాంట్రాక్ట్ కార్మికులకు పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు డి.కిషన్ డిమాండ్ చేశారు. రాగన్నగూడలోని వార్డు కార్యాలయం ఎదుట కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం డిప్యూటీ కమిషనర్ సత్యనారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా కిషన్ మాట్లాడుతూ రెండేళ్ల క్రితం కాంట్రాక్టు పద్ధతిన 48మంది కార్మికులను నియమించుకున్నారని, వీరికి మూడునాలుగు నెలలకోసారి జీతాలు ఇస్తున్నారన్నారు. వేతనాలు సకాలంలో ఇవ్వకపోవడంతో కార్మికులకు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవు తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల డిమాండ్ పట్ల వెంటనే స్పందించిన డీసీ సత్యనారాయణరెడ్డి పెండింగ్ వేతనాలను వెంటనే ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు కిషన్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ తుర్కయంజాల్ కన్వీనర్ ఎం.సత్యనారాయణ, నాయకులు ఎ. మాధవరెడ్డి, కార్మికులు నార్లకంటి సాలయ్య, గోపాల్, ప్రవీణ్, సుధాకర్, చెక్క స్వప్న, మల్లెల జయ, యశోద, మంజుల, విష్ణు, రాధిక, లలిత, యాదమ్మ,, దీవెన, జ్యోతి, సంజయ్ కుమార్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.