calender_icon.png 6 September, 2025 | 5:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాని @17 స్పెషల్ స్టిల్

06-09-2025 12:31:14 AM

నేచురల్ స్టార్‌గా అభిమానుల గుండెల్లో స్థానం పదిలపర్చుకున్న హీరో నాని సినీప్రయాణం 17 ఏళ్ల మైలురాయిని చేరుకుంది. ఈ ప్రత్యేక సందర్భా న్ని చిత్ర పరిశ్రమ సెలబ్రేట్ చేసుకుంటోంది. నాని ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’ చిత్రం కోసం పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజె క్టును రూపొందిస్తున్న మేకర్స్ నాని 17 ఏళ్ల ఇండస్ట్రీ సినీప్రయాణం పూర్తయిన క్షణాలను పురస్కరించుకొని ఈ సినిమా నుంచి ఓ పవర్‌ఫుల్ స్టిల్‌ను రిలీజ్ చేశారు.

ఈ స్టిల్‌లో నాని కంప్లీట్ బీస్ట్ మోడ్‌లో కనిపిస్తూ, ఇప్పటివరకు ఎన్నడూచూడని ఫెరోషియస్ అవతార్‌లో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా టాకీ పార్ట్ షూటింగ్ హైదరాబాద్‌లో వేసిన మ్యాసీవ్ సెట్స్‌లో జరుగుతోంది. ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2026, మార్చి 26న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్.. మొత్తం ఎనిమిది భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.