23 June, 2026 | 1:32 AM

ఇంగ్లాండ్‌కు ఐసీసీ షాక్

23-06-2026 12:00 AM

స్లో ఓవర్ రేటతో 12 పాయింట్లు కోత

దుబాయి, జూన్ 22 : రెండో టెస్టులో న్యూజిలాండ్‌పై చిత్తుగా ఓడిన ఇంగ్లాండ్ జట్టుకు ఐసీసీ షాకిచ్చింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఐసీసీ తీవ్రమైన క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ప్రస్తుత ఐసీసీ వరల్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల 12 పాయింట్లు కోత విధించింది. అంతేకాదు జట్టులోని ఆటగాళ్లందరికీ మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా కూడా విధించింది.

కివీస్‌తో రెండో టెస్టులో ఇంగ్లీష్ జట్టు 12 ఓవర్లు ఆలస్యంగా వేసింది. దీంతో 12 పాయింట్లను కోల్పోవాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌కు ముందు ఇంగ్లాండ్ ఖాతాలో 50 పాయింట్లు ఉన్నాయి. ఇప్పుడు 12 పాయిం ట్ల కోతతో అటు పర్సంటేజీలోనూ దెబ్బ పడింది. ఫలితంగా 34.72 శాతం నుంచి 26.38కి పడిపోయి ఏడోస్థానానికి పరిమితమైంది. ఒక టెస్ట్ మ్యాచ్ గెలిస్తే వచ్చే పాయింట్లను ఇలా స్లో ఓవర్ రేట్‌తో కోల్పోవడం ఇంగ్లాండ్‌కు గట్టి ఎదురుదెబ్బ.