అమన్‌రావు విధ్వంసం
32 బంతుల్లోనే సెంచరీ
టీజీ20 లీగ్‌లో రికార్డులు
హైదరాబాద్, జూన్ 22: తెలంగాణ టీ20 లీగ్‌లో తొలి సెంచరీ నమోదైంది. ఉప్పల్ స్టేడియం వేదికగా మెదక్ ఫాల్కన్స్‌తో మ్యాచ్‌లో వరంగల్ వారియర్స్ కెప్టెన్ అమన్రావు పేరాల విధ్వంసకర సెంచరీతో చెలరే గాడు. కేవలం 32 బంతుల్లోనే శతకం బాదేశాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ప్రత్యర్ధి బౌలర్లను అమన్ ఉతికారేశాడు. మెదక్ కెప్టెన్ తిలక్ వర్మను కూడా అతడు విడిచిపెట్టలేదు. 7 ఓవర్ వేసిన తిలక్ బౌలింగ్‌లో అతడు 15 పరుగులు చేశాడు.
ఈ క్రమంలో అమన్ రావు కేవలం 32 బంతుల్లోనే తన సెంచరీ మార్కును అందుకున్నాడు. ఆద్యంతం రెచ్చిపోయిన అమన్ 48 బంతుల్లో 12 ఫోర్లు, 13 సిక్సర్లతో 142 పరుగులు చేసి ఔటయ్యాడు. కాగా రాష్ట్రాల టీ20 లీగ్స్‌లో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. కాగా అమన్‌రావు ఐపీఎల్-2026 లో రాజస్తాన్ రాయల్స్ జట్టులో ఉన్నాడు. అమన్ రాజస్తాన్ తరపున అరంగేట్రం చేయనప్పటకీ ఆర్చర్ వంటి ఫాస్ట్ బౌలర్లను నెట్స్ లో ఎదుర్కోవడం కలిసొచ్చింది. 2025 విజయ్ హజారే ట్రోఫీలో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ చేశాడు.






