calender_icon.png 21 November, 2025 | 9:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాలలకు ఐడియల్ సంస్థ రూ.10 లక్షల విరాళం

21-11-2025 12:00:00 AM

కొల్లాపూర్ రూరల్ నవంబర్ 20 : కొల్లాపూర్ నియోజకవర్గంలో పాఠశాలల అభివృద్ధికి మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపు మేరకు ఐడియల్ సంస్థ రూ.10 లక్షలు ప్రకటించినట్లు రత్నగిరి ఫౌండేషన్ కన్వీనర్ కేతూరి ధర్మతేజ పేర్కొన్నారు. జూపల్లి అరుణ్ ఆధ్వర్యంలో రాణి ఇందిరాదేవి ప్రభుత్వ బాలుర కళాశాలను సందర్శించి అవసరాలను పరిశీలించారు. విరాళంలో భాగంగా గంట్రావుపల్లి పాఠశాలకు రూ.5 లక్షలు, కొల్లాపూర్ జూనియర్ కాలేజీకి రూ.5 లక్షలు కేటాయించారు. కళాశాల ప్రిన్సిపాల్ సుధీర్, అధ్యాపకులు రవి, మధు, ఫౌండేషన్ సభ్యులు సాయిచరణ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.