calender_icon.png 21 November, 2025 | 9:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి

21-11-2025 12:00:00 AM

ట్రాఫిక్ ఎస్‌ఐ కృష్ణ చైతన్య

నారాయణపేట క్రైమ్, నవంబర్ 20 : జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ ఎస్‌ఐ కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కృష్ణ చైతన్య మాట్లాడుతూ... ప్రతి ఆటో డ్రైవర్ తప్పనిసరిగా సరైన పత్రాలు (లైసెన్స్, RC, ఇన్సూరెన్స్ మొదలైనవి) కలిగి ఉండాలని, వాహనాలలో అధిక సంఖ్యలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించు కోవద్దని సూచించారు.

ఎవరైనా ప్రయాణికులు తమ వస్తువులు బ్యాగ్ లు, ఇతర వస్తువులు వాహనంలో మరిచిపోయినట్లయితే, నిజాయితీగా వాటిని తిరిగి అందించి నీతిని పాటించాలని తెలిపారు.  ఆటోలను ఒక క్రమ పద్ధతిలో పార్క్ చేయాలనీ, రాష్ డ్రైవింగ్ చేయరాదని, ఎలాంటి ట్రాఫిక్ జామ్లు లేకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రజలకు భద్రత, సౌక ర్యం కల్పించడంలో ఆటో డ్రైవర్లు సహకరించాలని ఎస్త్స్ర కోరారు.