17 April, 2026 | 10:25 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

అపోలో డాక్టర్‌కు ఐడీఎస్‌ఏ ఫెలోషిప్

13-05-2024 12:08 AM

హైదరాబాద్, మే 12 (విజయక్రాంతి): అపోలో హాస్పిటల్ డా క్టర్ సునీత నర్రెడ్డి.. ఐడీఎస్‌ఏ (ఇన్ఫెక్షియస్ డిసీజెస్ సొసైటీ అమెరి కా) ఫెలోషిప్‌కు ఎన్నికైనట్లు ఆ సంస్థ ప్రకటిం చింది. అంటువ్యాధుల రంగంలో డాక్టర్ సునీత నర్రెడ్డి చేసిన విశేషమైన కృషికి, అంకితభావానికి గుర్తింపుగా ఈ అవకాశం దక్కినట్లు అపోలో యాజమాన్యం ప్రకటించింది. అంటువ్యాధులపై అవగాహన, నివారణ, చికిత్సను అందించడంలో నిబద్ధత లాంటి అంశాలు ఆమె ఫెలోషిప్ ఎంపికలో దోహదపడ్డాయని వెల్లడించింది.

ఈ ఫెలోషిప్ దక్కినందుకు ఎంతో గౌరవంగా భావిస్తున్నానని డాక్టర్ సునీత నర్రెడ్డి ఈ సందర్భంగా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐడీఎస్‌ఏ గుర్తింపు పొందినందుకు సునీత నర్రెడ్డిని అభినందిస్తున్నట్లు అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతా రెడ్డి పేర్కొన్నా రు. అంటువ్యాధులను ఎదుర్కోవడంలో అత్యుత్తమ నైపుణ్యాన్ని కనబర్చిన వ్యక్తులకు ఐడీఎస్‌ఏ ఫెలోషిప్ లభిస్తుంది.