18 April, 2026 | 12:00 AM

గుండెపోటుతో పోలింగ్ అధికారి మృతి

13-05-2024 12:07 AM

ఎన్నికల విధుల్లో ఉండగానే ఘటన

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 12 (విజయక్రాంతి): హైదరాబాద్ జిల్లాలో పోలింగ్ విధులకు హజరైన ఓ ఉద్యోగి గుండెపోటుతో మరణించారు. నాంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని పోలింగ్ బూత్ 151లో పోలింగ్ ఆఫీసర్‌గా విధులకు హజరైన నరసింహరావు (45) గుండెపోటు రావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం అంతా పోలింగ్ మెటీరియల్ తీసుకుని పోలింగ్ కేంద్రానికి తరలివెళ్లిన అనంతరం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకోవడం పట్ల పలువురు సహోద్యోగులు తీవ్రమైన బాధను వ్యక్తం చేశారు. మృతుడు నరసింహరావు ముషీరాబాద్ మైనార్టీ బాలుర రెసిడెన్సియల్ పాఠశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నట్టు నాంపల్లి అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిణి ఎస్ జ్యోతి తెలిపారు.