24-12-2025 07:46:40 PM
భార్య భర్తలు ఇద్దరికీ స్వల్ప గాయాలు
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు భార్య భర్తలు ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యారు. స్థానిక ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని మెల్లకుంట తండా గ్రామానికి చెందిన మూడ్ బిచ్ (50) మూడ్ బిచ్ తన ద్విచక్ర వాహనం టీఎస్ 17 ఈ 5265పై తన భార్య మూడ్ మోతి ఎక్కించుకొని బంధువుల అంత్యక్రియల నిమిత్తం మెదక్ వెళ్తుండగా మార్గ మధ్యలో గోపాల్పేట్ హైదరాబాద్ బోధన్ ప్రధాన రహదారిపై గల పెట్రోల్ బంకు వద్దకు చేరుకున్నారు. మెదక్ నుండి ఎల్లారెడ్డి వైపు వెళ్తున్నటువంటి టీఎస్ 06 జెడ్ 0256 నెంబర్ గల ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఢీకొట్టడంతో ఇరువురి భార్యాభర్తలకు స్వల్ప గాయాలయ్యారు. చికిత్స నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగిందని స్థానిక ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపారు.