28-10-2025 12:00:00 AM
ధన్య బాలకృష్ణన్ కన్నడ అమ్మాయి. కానీ, తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసి, మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె హీరోయిన్‌గా నటిస్తున్న తాజాచిత్రం ‘కృష్ణలీల’. దేవన్ హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. మహాసేన్ విజువల్స్ బ్యానర్‌పై జ్యోత్స్న జీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, మాటలు- అనిల్ కిరణ్‌కుమార్ జీ అందించారు. సోమవారం ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను మేకర్స్ హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కథానాయకి ధన్య షాకింగ్ కామెంట్స్ చేసింది.
“ఇండస్ట్రీలో ఉండాలంటే రొమాంటిక్ సీన్స్, ఇంటిమేట్ సీన్స్ చేయడం తప్పనిసరి అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ధన్య మాట్లాడుతూ.. “సినిమాల విషయంలో నాకు నేను చాలా నిబంధనలు పెట్టుకున్నా. అందుకే స్టార్‌ను కాలేకపోయా. ఇంటిమేట్ సీన్స్, రొమాంటిక్ సీన్స్ చేయొద్దని ముందే నిర్ణయించుకున్నా. అలా పెద్దపెద్ద సినిమాను చాలా వదులుకున్నా. అలాంటి సీన్స్ చేసుంటే స్టార్ స్టేటస్‌ను అనుభవించేదాన్ని. కానీ, నేను ఇప్పుడున్న స్థాయిలోనే చాలా సంతోషంగా ఉన్నా.
ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి ఈ స్థాయికి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు. అలాంటి పెద్ద సినిమాలు చేయడం కంటే మంచి సినిమాలు చేయడమే నాకిష్టం. ఇక ఈ ‘కృష్ణలీల’ సినిమానా కెరీర్‌కు మళ్లీ టర్నింగ్ పాయింట్ అవుతుంది” అని తెలిపింది. ఇంకా ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మాజీ సీబీఐ ఆఫీసర్ జేడీ లక్ష్మీనారాయణ, ప్రముఖ నిర్మాత సురేశ్‌బాబు, హీరో దేవన్, నిర్మాత జోత్స్న, చిత్ర కథా రచయిత అనిల్‌కిరణ్, మిగతా చిత్రబృందం కూడా తమ అభిప్రాయాలు, అనుభవాలు పంచుకున్నారు.