calender_icon.png 30 October, 2025 | 4:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అకాల వర్షం అపార నష్టం

29-10-2025 05:20:30 PM

మరిపెడ మండలంలో తీవ్రంగా నష్టపోయిన పత్తి వరి రైతులు..

మరిపెడ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల ప్రాంతాల్లో పత్తి పంటకు ఇటీవల విపరీతమైన వర్షాల కారణంగా భారీ నష్టం జరిగింది. పంట కోత దశలో ఉన్న పంటలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి.. దిగుబడి భారీగా పడిపోయింది. ముఖ్యంగా పత్తి పంటలో కాయలు పగిలి పోవడం, రంగు మారడం, వరుసగా  వర్షాలతో పత్తి కాయలు పగిలి పోవడంతో తక్కువ దాణా, రంగు మారడం, పూత రాలిపోవడం జరుగుతోంది. దిగుబడి తగ్గడం.. గత సంవత్సరం ఎకరాకు 10 క్వింటాళ్లు వచ్చి ఉండగా, ఈ ఏడాది 3–6 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి అంచనాలు ఉన్నాయి.

నష్టానికి గల ముఖ్య కారణాలు వరుస వర్షాలు పంట కోత సమయంలో రావడం కాయలు మచ్చలు, కాయలు మురిగి పోవడం, తేమ ఎక్కువగా ఉండడం పెట్టుబడి కూడా తిరిగి వచ్చిన పరిస్థితి లేదు, మండలం స్థాయిలోని గ్రామాల్లో ఎకరాలను దెబ్బతినడం. పత్తి పంట పైనే అత్యధిక ప్రభావం రైతులకు పరిష్కార సూచనలు ఇచ్చి తక్షణ  క్రాప్ డామేజ్ సర్వే చేసి, రైతులకు నష్ట పూరణ అందించాలి. ప్రభుత్వ నష్ట పూరణ, క్రాప్ ఇన్సూరెన్సు మరింత పటిష్టంగా అమలు చేయాలి. ఈ పరిస్థితుల దృష్ట్యా, రైతులు తీవ్ర ఆందోళనలో ఉంటూ, పెట్టుబడులు కూడా తిరిగి రాకపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నారు. మరిపెడ మండలంలోని రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నారు.