calender_icon.png 30 October, 2025 | 4:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీవితంలో క్రీడలది కీలక భూమిక

29-10-2025 05:25:59 PM

గీతం క్రీడాపోటీల ప్రారంభోత్సవంలో స్పష్టీకరించిన ప్రొఫెసర్ చిన్నప్పరెడ్డి..

పటాన్ చెరు: ఒకరి వ్యక్తిత్వాన్ని రూపొందించడంలో, సృజనాత్మకత, శ్రేయస్సులను పెంపొందించడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని వరల్డ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అలయన్స్ బోర్డు డైరెక్టర్, గ్లోబల్ కమ్యూనిటీ హెల్త్ టెక్నికల్ హెడ్ ప్రొఫెసర్ చిన్నప్పరెడ్డి అన్నారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని స్పోర్ట్స్ డైరెక్టరేట్, గస్టో 2025-26 పేరిట నిర్వహిస్తున్న మూడు రోజుల అంతర్-విశ్వవిద్యాలయ, అంతర్-కళాశాల క్రీడా పోటీలను బుధవారం ఆయన జ్యోతి ప్రజ్వలతో లాంఛనంగా ప్రారంభించారు. 

ఈ ప్రాంతంలోని పలు విశ్వవిద్యాలయాలు, కళాశాలల నుంచి వచ్చిన యువ క్రీడాకారులను ఉద్దేశించిన ప్రొఫెసర్ చిన్నప్పరెడ్డి మాట్లాడుతూ, ‘ఆట ఉద్యోగం కోసం కాదు; ఇది వినోదం, ఉత్తేజం, పునర్జీవనం కోసం’ అన్నారు. విద్యార్థులు తమ ఆసక్తి, అభిరుచి అనుగుణంగా ఎంపిక చేసుకుని, జీవితాన్ని కొనసాగించాలని ఆయన ప్రోత్సహించారు. క్రీడలలో పాల్గొనడం వల్ల అభ్యాసం, జ్జాపకశక్తి, ఉపాధి అవకాశాలు ఎలా పెరుగుతాయో ఆయన పలు అంతర్జాతీయ, జాతీయ ఉదంతాలను ఉటంకిస్తూ చెప్పారు. విద్యతో పాటు పాఠ్యేతర కార్యకలాపాలలో పాల్గొన్న విద్యార్థులు రాణించిన ఉదాహరణలను ఆయన వివరించారు.

ముఖ్య అతిథిగా క్రీడా పోటీలను ప్రారంభించిన ప్రొఫెసర్ చిన్నప్పరెడ్డిని గీతం హైదరాబాదు అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, ఆతిథ్య-క్యాంపస్ లైఫ్ డైరెక్టర్ అంబికా ఫిలిప్, స్పోర్ట్స్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎం.నారాయణరావు చౌదరి సత్కరించారు. గస్టో-2025-26లో క్రికెట్, వాలీబాల్, టేబుల్ టెన్నిస్, ఫుట్ బాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, త్రోబాల్, బాస్కెట్ బాల్ వంటి ఉత్కంఠభరితమైన క్రీడా పోటీలుంటాయి. ఈ పోటీలలో సిద్దార్థ, ఎంజీఐటీ, ఎంఎల్ఆర్డీ, భవన్స్ లయోలా అకాడమీ, మహీంద్రా, ఎన్ఐసీఎంఏఆర్, కేఎల్ యూ-హెచ్, వీఎన్ఆర్ వీజేఐటీలతో పాటు గీతం వంటి ప్రఖ్యాత సంస్థల జట్ల పోటీపడుతున్నాయి. ప్రాంగణాన్ని నైపుణ్యం, సంకల్పం, క్రీడా స్ఫూర్తి యొక్క శక్తివంతమైన వేదికగా మారుస్తున్నాయి. మూడు రోజుల పాటు ఉత్కంఠభరితంగా, స్నేహపూర్వక జరిగే ఈ పోటీలు గస్టో యొక్క నిజమైన స్ఫూర్తిని, ఆట, అభిరుచి, పట్టుదలను ప్రతింబింబిస్తున్నాయి.