28-10-2025 12:00:00 AM
స్టార్ హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో ఓ భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ‘ఏఏ22Xఏ6’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ సినిమాకు దాదాపు రూ.1000 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. సన్ పిక్చ ర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ప్రస్తు త ముంబై షెడ్యూల్ పూర్తయిన తర్వాత టీమ్ లండన్, న్యూయార్క్, దుబాయ్, టోక్యో వంటి నగరాల్లో షూటింగ్ చేయనున్నట్టు సమాచారం.
సోషియో మైథాలజీ ఫాంటసీతోపాటు సై-ఫై యాక్షన్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కతున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ దీపికా పడుకొణె హీరోయిన్‌గా మరోమారు యాక్షన్‌తో ఆకట్టుకోనుంది. కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి మరో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. తాజాగా ఈ సినిమాలో స్టార్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ నటిస్తున్నట్టు తెలుస్తోంది. సీతారామం, హాయ్ నాన్న వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మది దోచుకున్న ఈ భామ ఈ భారీ ప్రాజెక్ట్‌లో కీలక పాత్రలో కనిపించబోతోందట. ఆమె పాత్ర కథలో ప్రధాన మలుపు తిప్పే కీలక క్యారెక్టర్ అని సమాచారం.
ఇక మృణాల్ సినిమాల విషయానికొస్తే.. ఈ భామ హీరోయిన్‌గా నటించిన ‘డకాయిట్’ విడుదలకు సిద్ధంగా ఉంది. అడివి శేష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షనీల్ డియో దర్శకత్వంలో వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ సినిమాకు సునీల్ నారంగ్ సహ నిర్మాత. ఈ సినిమా ట్రైలర్ మంగళవారం విడుదల కానుంది.