18-08-2025 01:05:26 AM
ఘట్ కేసర్, ఆగస్టు 17 : దళిత బహుజనులు ఏకమై పోరాడితే రాజ్యాధికారం సాధించవచ్చని మర్పల్లిగూడ అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, మాజీ వార్డు సభ్యులు చిలుకూరి ఆనంద్ అన్నారు. ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లడానికి నిర్వహిస్తున్న 227వవారం నిత్య పూలమాల కార్యక్రమం ఆదివారం ఘట్ కేసర్ పట్టణంలో జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, మాజీ వార్డు సభ్యులు చిలుగూరి ఆనంద్ విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలని ఏకం చేసి బహుజన రాజ్యాధికార దిశగా అడుగులు వేయాలని తెలియజేశారు. అందరూ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు.
ఇలా ప్రజలని చైతన్య పరుస్తున్న మీసాల అరుణ్ కుమార్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు మేకల దాసు, నాయకులు బండారి రాందాస్, కె. సత్యం, మీసాల రాజేష్ కుమార్, కడప రవి, డి. శ్రీకాంత్, జి. అంజయ్య, బి. గణేష్ గౌడ్, పోతగాని శేఖర్. ఇ. విష్ణు, వివేక్, జె. అఖిల్, లలిత్, సోము, విహాన్ తదితరులుపాల్గొన్నారు.