calender_icon.png 19 August, 2025 | 4:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఎన్నిక

18-08-2025 01:03:42 AM

ఎల్బీనగర్, ఆగస్టు 17 : భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆర్కేపురం డివిజన్ టెలిఫోన్ కాలనీలోని విశ్వహిందూ పరిషత్ భవన్ లో కన్వీనర్ బుక్క రమేశ్ ఆధ్వర్యంలో ఆదివారం నూతన కమిటీని ఎన్నుకున్నారు. కన్వీనర్ గా బుక్క రమేశ్, కో కన్వీనర్లుగా రేగుల కిరణ్ కుమార్ గౌడ్, తమన్న శ్రీధర్, జాయింట్ కన్వీనర్లుగా గుత్తా నర్సింహారెడ్డి, విశాల్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా రేణిగుంట శ్రీనివాస్,

రాజ్ సంగీత్ శ్రీనివాస్, యూత్ విభాగ్ కన్వీనర్ గా ఆర్కేపురం మల్లేశ్, మీడియా సెల్ కన్వీనర్లుగా రఘువీర్, ఉప్పల శ్యామ్, కార్యవర్గ సభ్యులుగా కొత్తపల్లి శ్రీనివాస్, ఓరుగంటి సుధాకర్, గార్లపాటి రాంప్రసాద్, కత్తూరి శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో నాయకులు కల్వకుర్తి శేఖర్, బి.సురేశ్, ముంతా రాములు తదితరులుపాల్గొన్నారు.