calender_icon.png 6 July, 2025 | 10:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శపథం పక్కనపెట్టి మళ్లీ ఆయుధం పడితే..

06-07-2025 12:30:27 AM

చాలా రోజుల విరామం తర్వాత ఆర్కే సాగర్ నటిస్తున్న చిత్రం ‘ది 100’. ఈ క్రైమ్ థ్రిల్లర్‌కు రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించారు. కేఆర్‌ఐఏ ఫిల్మ్ కార్ప్, ధమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రమేశ్ కరుటూరి, వెంకి పుషడపు సంయుక్తంగా నిర్మించారు. జూలై 11న థియేటర్లలోకి రానున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను టాలీవుడ్ స్టార్ పవన్‌కల్యాణ్ శనివారం లాంచ్ చేశారు.

‘జీవితంలో జరిగిపోయినది మనం మార్చలే ము, కానీ జరగబోయేదాన్ని కచ్చితంగా ఆపగలం’ అనే విక్రాంత్ ఐపీఎస్ వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ఆయుధాన్ని ఎప్పుడూ ఉపయోగించకూడదనే నిర్ణయించుకున్న పోలీస్ అధికారి ఆయు ధం తీసుకోవడం తప్ప వేరే మార్గం లేని పరిస్థితుల్లోకి రావడానికి కారణం ఏంటి? అనేదే సినిమా కథ.

మిషా నారంగ్, ధన్య బాలకృష్ణ, గిరిధర్, ఆనంద్, లక్ష్మీగోపాలస్వామి, కల్యాణి నటరాజన్, విష్ణుప్రియ, టెంపర్ వంశీ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్; డీవోపీ: శ్యామ్ కే నాయుడు.