06-07-2025 12:31:34 AM
ఇప్పటికే పలు సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్న తరుణ్ భాస్కర్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లో లీడ్ రోల్ పోషిస్తున్నారు. ఇందులో ఈషా రెబ్బా కథానాయికగా నటిస్తోంది. రూరల్ ఎంటర్‌టైనర్‌గా రాబోతునన్న ఈ చిత్రానికి కొత్త డైరెక్టర్ ఏఆర్ సజీవ్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు నిర్మాతలు. బ్రహ్మానందం, బ్రహ్మాజీ, సురభి ప్రభావతి, గోపరాజు విజయ్, శివన్నారాయణ (అమృతం అప్పాజీ), బిందు చంద్రమౌళి, ధీరజ్ ఆత్రేయ, అన్ష్వీ ఇందులో కీలక పాత్రల్లో నటించారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమాకు సంబంధించి కాన్సెప్ట్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. 2డీ యానిమేషన్ స్టయిల్‌లో ఉన్న ఈ వీడియో ద్వారానే సినిమా టైటిల్ ‘ఓం శాంతి శాంతి శాంతిః’ అనే విషయాన్ని రివీల్ చేశారు.
ఈ వీడియోలో కథానాయకుడు తరుణ్‌ను వ్యాన్ యజమాని అంబటి ఓంకార్ నాయుడుగా, కథానాయిక ఈషాను కొండవీటి ప్రశాంతి అనే పల్లెటూరి అమ్మాయిగా పరిచయం చేశారు. అదేవిధంగా ఈ సినిమా ఆగస్టు 1న విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి సంగీతం: జై క్రిష్; డీవోపీ: దీపక్ యెరగరా.