06-07-2025 10:27:47 PM
నిన్ను నమ్మ నీ ఆసరా బుక్ చూసి నమ్ముతా..
ఆసరా బుక్ తనాక పెట్టుకుని గుడుంబా పోస్తున్న అక్రమార్కులు..
గ్రామాల్లో గట్టు రట్టుగా నాటుసారా..
విచ్చలవిడిగా గుడుంబా వ్యాపారం..
పట్టుకోని ఎక్సైజ్ అధికారులు..
కన్నాయిగూడెం (విజయక్రాంతి): ములుగు జిల్లా(Mulugu District) కన్నాయిగూడెం మండలంలో గుడుంబా వ్యాపారుల దందాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. గ్రామాలలో గుట్టుచప్పుడు కాకుండా గుడుంబాను విక్రయిస్తు సొమ్ము చేసుకుంటున్నారు. కొందరు వ్యక్తులు గుడుంబాను పలిమేల, సర్వాయిపేట, తాళ్ళగూడెం నుండి తీసుకుని వచ్చి కన్నాయిగూడెం మండలంలోని పలు గ్రామాలలో విచ్చలవిడిగా అమ్ముతున్నారు. వైన్‌షాపులో మద్యం ధరలు పెరిగి ఉండడంతో మందు బాబులకు గుడుంబా దొరికిందే చాలు అన్నట్లు గుడుంబాను తాగి అనారోగ్యం పాలవుతున్నారు. శనివారం రోజున ముప్పనపల్లి గ్రామంలో ఓ వ్యక్తి కల్తీ నాటుసారా తాగి చనిపోయాడు. నాటుసారాకు వ్యవసాయానికి ఉపయోగించే అమోనియాతో చక్కెరను కలిపి గుడుంబాను తయారు చేస్తున్నారు. ఇప్పుడు అక్రమార్కులు కొత్త రూటు మార్చారు.
గతంలో బుట్టాయిగూడెంలో ఓ వ్యక్తి లిక్విడ్ తో గుడుంబా తయారు చేసి కన్నాయిగూడెం మండలంలో చేశాడు. ఇప్పుడు కూడా అదే రీతిలో చేస్తున్నారని గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు. ఆ గుడుంబానే మండల వ్యాప్తంగా గుడుంబాను అమ్ముతున్నట్లు తెలియవస్తుంది. ఈ దందా బుట్టాయిగూడెం, ముప్పనపల్లి, గూర్రేవులా, లక్ష్మీపురం, చింతగూడెం, ఏటూరు, గ్రామాల్లో జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నాటుసారా ప్యాకెట్ల రూపకంగా రాత్రికి రాత్రే గుట్టు చప్పుడు కాకుండా గ్రామాలలోని కిరాణా దుకాణాలతో పాటు గుడుంబా అమ్మే ప్రాంతాలకు సరఫారా చేస్తున్నారు ఇంకా కొందరు పలిమేల మండలం నుండి ప్యాకెట్ల రూపంలో తీసుకుని వస్తున్నాయి. ప్రభుత్వం వవృద్ధులకు, వికలాంగులకు వితంతువులకు ఆసరా పింఛన్ ఇస్తుంది కన్నాయిగూడెం మండలంలో గుడుంబా అమ్మేవారు .
ఆసరా బుక్ తనాక పెట్టుకుని గుడుంబా పోస్తున్నారు మందు బాబులను నీకు గుడుంబా పోయాలంటే నీ ఆసరా ఇక్కడ పెట్టు ఆసరా పింఛన్ ఇచ్చేటప్పుడు తీసుకుని పోయి నాకు డబ్బులు ఇచ్చి నీ ఆసరా బుక్ తీసుకుని పోమ్మని అంటున్నారని ఓ మందుబాబు ఆవేదన ఇంకొందరు మందు బాబులు అయితే నన్ను నమ్మకపోతే నా ఆసరా బుక్ చూసి నమ్ము అని పబ్లిక్ గా అంటూ తాగుతున్నారు. దీంతో ఈ దందా మూడు పువ్వులు, ఆరు కాయల రూపంలో సాగుతోంది. ఎక్సైజ్ పట్టించుకోకపోయోసరికి గ్రామాలలో బందోబస్తుగా పట్టపగలే గుడుంబా సరఫరా చేస్తుంటే పోలీసులు పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నారు అయినా ఆగడం లేదు. ఈ దందాపై గ్రామాలలో పరిశీలిస్తే ప్యాకెట్ల రూపకంగా గుడుంబాను అమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఈ గుడుంబాతో ప్రజల ఆరోగ్యాలు పాడుతుండడంతో గ్రామాలలోని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకైనా ఎక్సైజ్ అధికారులు మేల్కొని గుడుంబకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.