calender_icon.png 7 July, 2025 | 3:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఏ ఫలితాల్లో వెంకటాపురం విద్యార్థి ప్రతిభ

06-07-2025 10:22:40 PM

తొలి విడతలోనే కోర్సు పూర్తి..

వెంకటాపురం నూగూరు (విజయక్రాంతి): చార్టెడ్ అకౌంటెంట్(Chartered Accountant) ఫలితాల్లో వెంకటాపురంకు చెందిన విద్యార్థి తొలి విడతలోనే ఉత్తీర్ణుడయ్యాడు. ఆదివారం సీఏ ఫలితాలు విడుదల కాగా మొదటి విడతలోనే అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించి మండల కేంద్రానికి చెందిన బచ్చు రాహుల్ గౌతమ్ అందరి మన్ననలు పొందుతున్నాడు. 22 సంవత్సరాల వయసులోనే చార్టెడ్ అకౌంటెంట్ కోర్సు పూర్తి చేసుకొని ప్రశంసలు అందుకుంటున్నాడు. రాహుల్ గౌతం తండ్రి వెంకటాపురం మండల కేంద్రంలో గత 30 సంవత్సరాలుగా సత్యదేవ మెడికల్ షాపును నిర్వహిస్తున్నారు. రాహుల్ చిన్నప్పటినుంచి విద్య పట్ల చాలా శ్రద్ధ వహించేవాడని అతని కష్టానికి ఫలితంగానే ఇది సాధ్యమైందని రాహుల్ తండ్రి బచ్చు పూర్ణచందర్రావు విజయక్రాంతి ప్రతినిధికి తెలిపారు.

ఎల్కేజీ నుండి రెండో తరగతి వరకు స్థానిక విజయం స్కూల్లో విద్యాభ్యాసం ప్రారంభించిన రాహుల్, రెండో తరగతి నుండి 8వ తరగతి వరకు ఖమ్మం లోని న్యూ ఎరా స్కూల్లో చదివాడు. 9,10 తరగతులను ఖమ్మంలోని ఎంజీఆర్ కే కే ఆర్ హైస్కూల్లో పూర్తి చేశాడు. ఇంటర్మీడియట్ ను హైదరాబాదులోని మేధావి జూనియర్ కాలేజీలో చదివాడు. అనంతరం డిగ్రీని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో బిఎ జనరల్ కోర్స్ తో పూర్తి చేశాడు. చార్టెడ్ అకౌంటెంట్ కావాలన్నా తన లక్ష్యంతో హైదరాబాదులోని లక్ష్య చార్టెడ్ అకౌంటెంట్ కాలేజీలో చేరి ఈ ఫలితాల్లో మొదటి విడతలోనే విజయం సాధించాడు. రాహుల్ చార్టెడ్ అకౌంటెంట్ కోర్సు లో ఉత్తీర్ణత సాధించడం పట్ల మండల కేంద్రంలోని పలువురు రాహుల్ కు అభినందనలు తెలిపారు.