06-07-2025 09:52:37 PM
భారత్ vs ఇంగ్లాండ్: బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్(Edgbaston)లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. 336 పరుగుల భారీ తేడాతో భారత్ గెలుపొందింది. భారత్ నిర్దేశించిన 608 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 271 పరుగులకు ఆలౌటైంది. భారత పేసర్ ఆకాశ్ దీప్ ఆరు వికెట్లతో చెలరేగాడు. దీంతో భారత్ ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ విజయంతో శుభ్‌మన్ గిల్(Shubman Gill) నేతృత్వంలో జట్టు చరిత్ర సృష్టించింది. ఈ వేదికపై భారతదేశం తొలిసారిగా టెస్ట్ విజయం సాధించింది.
గతంలో బర్మింగ్‌హామ్‌లో భారత్ 8 మ్యాచ్‌లు ఆడి 7 మ్యాచ్‌లు ఓడిపోయింది, ఒక మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. చివరకు అక్కడ జరిగిన మ్యాచ్‌లో గెలవని భారత్... 58 ఏళ్ల చరిత్రను వారు బద్దలు కొట్టారు. గిల్ మొదటి ఇన్నింగ్స్‌లో 269 పరుగులు, రెండవ ఇన్నింగ్స్‌లో 161 పరుగులు చేయడం ద్వారా మొత్తంగా 430 పరుగులు చేశాడు. పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా లేకపోవడంతో ఆకాష్ దీప్ చివరి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టడంతో సహా 10 వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ సిరాజ్ కూడా తన పేరు మీద మొత్తం 7 వికెట్లతో జట్టుకు సహాయం చేశాడు.