calender_icon.png 6 July, 2025 | 11:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నవ్వులు.. భావోద్వేగాల సమ్మిళితం ఓ భామ అయ్యో రామ

06-07-2025 12:28:57 AM

సుహాస్ హీరోగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ఓ భామ అయ్యో రామ’. ఈ చిత్రంతో మలయాళ బ్యూటీ మాళవిక మనోజ్ (జో ఫేమ్) తెలుగు తెరకు కథానాయికగా పరిచయమవుతోంది. ప్రముఖ దర్శకులు హరీశ్‌శంకర్, మారుతి ఇందులో అతిథి పాత్రల్లో కనిపించబోతున్నారు.

రామ్ గోధల దర్శకత్వంలో వీ ఆర్ట్స్ పతాకంపై హరీశ్ నల్ల నిర్మిస్తున్న ఈ సినిమా జూలై 11న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ మూవీ ట్రైలర్‌ను శనివారం విడుదల చేశారు. నవ్వులు పంచుతూ, భావోద్వేగభరి తమైన కథ అని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత హరీశ్ నల్ల మాట్లాడుతూ.. ‘సుహాస్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రమిది. తప్ప కుండా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని స్తుంది’ అన్నారు.