calender_icon.png 7 July, 2025 | 2:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరసన కార్యక్రమాలకు అనుమతి ఇవ్వలేదు

06-07-2025 09:10:41 PM

ములుగు జిల్లా డిఎస్పీ రవీందర్..

ములుగు (విజయక్రాంతి): ములుగు పోలీస్ స్టేషన్(Mulugu Police Station) పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ నిమిత్తంగా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీకి చెందిన మండల స్థాయి ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తేది 07-07-2025 రోజున తమ తమ నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని అనుమతి కోరిన విషయం తెలియజేశారు. అయితే, అదే రోజున ములుగు జిల్లాలో మంత్రుల పర్యటన ఉన్న నేపథ్యంలో శాంతి భద్రతల దృష్ట్యా ఇరు పార్టీల నిరసన కార్యక్రమాలకు అనుమతి ఇవ్వలేమని వారికి స్పష్టంగా తెలియజేయబడింది. కానీ, ఎవరైనా పోలీసు అధికారుల ఉత్తర్వులను ఉల్లంఘించిన పక్షంలో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇరు పార్టీల నాయకులకు తెలియజేయడమైనది. ఇందులో భాగంగా, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని ఇరు పార్టీల నాయకులను కోరడమైనది.